పారిశుద్ధ్యం... పంచాయతీ కేంద్రాల్లో అధ్వానం
వర్షాకాలం వచ్చిన మురుగు కాల్వలలో తొలగని మురుగు
దోమలకు ఆవాసంగా మారుతున్న మురుగు కాలువలు..
ఉట్నూర్, జులై 6 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలో 473 గ్రామపంచాయతీలు ఉన్నాయి. చెత్తను సేకరించేందుకు సరైన వనరులు లేక పోవడంతో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోతుంది. ముఖ్యంగా మురికి కాలువలు శుభ్రతకు నోచుకోవడం లేదు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్ కవర్లతోపాటు ఇతర చెత్తను కాలువల్లో పడేయడంతో దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ తో పాటు కార్మికులను నియమించిన వారు కేవలము రోడ్ల శుభ్రతకే సరిపోతున్నారు. వర్షాకాలంలో మురికి కాలల్లో చెత్త ను తొలగించకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలు వైరాల్ జరాల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని మురికి కాలువలను శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు..
మార్గదర్శకాలకు తిలోదకాలు...
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ వ్యవస్థలో చెత్త నిర్వహణకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం అమలు పరచడం లేదు. ప్రతి ఇంటి నుంచి నిర్దిష్ట రోజుల్లో చెత్తను సేకరించాలి. తడి పొడి చెత్తను ఇంటి వద్దనే విభజించి సేకరించాలి. జనాభా ఆధారంగా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం, గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా పర్యవేక్షణ చేయాలి. తడి ఇతర వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చేందుకు గత ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మించిన కంపోస్ట్ షెడ్లు నిర్వహణ లేక వృధాగా మారాయి.
అద్వాన్మంగా మురికి కాలువలు..
గ్రామపంచాయతీలో మురుగునీరు.. వర్షం నీరు రోడ్లపై రాకుండా నిర్మించిన మురుగు కాలువలు అధ్వానంగా మారాయి. ఈ కాలులను శుభ్రం చేయకపోవడంతో కాలువలు నిండిపోయి వర్షం నీటితోపాటు మురుగునీరు రోడ్లపై చేరి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. వర్షాకాలం కు ముందు మురుగు కాలువలను శుభ్రం చేయించవలసిన పంచాయితీ అధికారులు నిధులు రావడం లేదని షాకుతో మురుగు కాలును పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన నిధులను పంచాయతీ అధికారులు వాటిని గత ప్రభుత్వ హాయంలో ఖర్చు చేసిన వాటికి నిధులను తీసుకున్నారు. దీంతో వర్షాకాలం ప్రారంభమైన నేటికీ పలు పంచాయతీల్లో మురుగు కాలువలు నిండుకుపోయిన వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదకన మూరకి కాలువలను శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
శుభ్రత పనులు చేపడతాం.. సంజీవరావు, ఎంపీఈఓ, ఇంద్రవెల్లి..
గ్రామపంచాయతీలో శుభ్రత పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని ఎంపీఈఓ సంజీవరావు అన్నారు. వర్షాకాలంలో గ్రామాల్లో శుభ్రత పాటించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.






