6 July, 2026 | 1:51 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ

06-07-2026 12:59 PM

నేరేడుచర్ల, జూలై 06(విజయ క్రాంతి ): సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల(Nereducherla Government Junior College) నూతన ప్రిన్సిపల్ గా పూసం. నీరజ సోమవారం నాడు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇప్పటివరకు ఖమ్మం జిల్లా ఇల్లందులో కెమిస్ట్రీ లెక్చరర్ గా,ఎఫ్.ఏ.సి ప్రిన్సిపల్ గా పనిచేస్తూ ఇటీవల పదోన్నతి పొందింది. ఈ మేరకు ఆమె ఇంచార్జి ప్రిన్సిపల్ పి.వెంకటరమణ నుంచి ప్రిన్సిపల్ బాధ్యతలను స్వీకరించారు.

ఈ సందర్భంగా  ఆమెను,రాష్ట్ర జీ.జె.ఎల్.ఏ అధ్యక్షులు, ఇంటర్ విద్య జాక్ చైర్మన్ డాక్టర్ పి మధుసుదన్ రెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపల్స్ సంఘం గౌరవాధ్యక్షులు కేఎస్ రామారావు, ప్రిన్సిపల్ సంఘ నాయకులు శేషు బాబు, పి శంకర్, జి జె ఎల్ ఏ నాయకులు ఖుర్షీద్ హమ్మద్, ప్రమీల, ఆయా కళాశాలల  ప్రిన్సిపల్ పవన్,గీతాబాయి, నాగేశ్వరరావు,విజయలక్ష్మి, ధనమ్మ, నవీన జ్యోతి,జి జె ఎల్ ఏ జిల్లా జనరల్ సెక్రెటరీ డాక్టర్ మద్దిమడుగు సైదులు, కళాశాల అధ్యాపకులు అధ్యాపకర సిబ్బంది పాల్గొని ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.