6 July, 2026 | 2:01 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

24-02-2026 12:00 AM

సీఎం కప్‌లో ప్రతిభ చాటిన బీ.ఆర్క్ విద్యార్థిని ఆశ్రిత రాజు

పటాన్ చెరు, ఫిబ్రవరి 23 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులోని బీ.ఆర్క్ తొలి ఏడాది విద్యార్థిని ఆశ్రిత రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కప్ 2025-26 పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటి మూడు బంగారు పతకాలను గెలుచుకుంది. సీఎం కప్ రెండో ఎడిషన్ తుది దశ పోటీలను ఫిబ్రవరి 20-21 తేదీలలో హైదరాబాదులోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో నిర్వహించారు. పికిల్ బాల్ ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్ డ్  డబుల్స్ పోటీలలో ఆశ్రిత నెగ్గి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకుంది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంటును తెలంగాణ స్పోరట్స్ అథారిటీ జనవరి 8 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ ఛాంపియన్ షిప్ లో హ్యాండ్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బిలియరడ్స్, ఫెన్సింగ్, లాన్ టెన్నిస్, పికిల్ బాల్ వంటి పోటీలను బహుళ-స్థాయి ఫార్మాట్ లో జరుపుతున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రారంభమై, తరువాత మండల, పట్టణ స్థానిక సంస్థల రౌండ్లను నిర్వహించారు.

చివరిగా హైదరాబాదులో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ నిర్వహిస్తున్నారు. ఆశ్రిత రాజు సాధించిన అద్భుతమైన విజయానికి గీతం నాయకత్వం అభినందనలు తెలియజేసింది. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ తదితరులు ఆమె అంకితభావం, క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యాలను ప్రశసించారు.