6 July, 2026 | 1:42 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల

06-07-2026 12:42 PM

హైదరాబాద్: రైతు భరోసా నిధులు విడుదల(Rythu Bharosa Funds) కొనసాగుతోంది. ఆరోరోజు తెలంగాణలో 7 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధులను విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ప్రకటించారు. ఇవాళ 92,729 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 354.96 కోట్లను నేరుగా జమ చేశారు. ఇప్పటివరకు 68.37 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. 124.85 లక్షల ఎకరాలకు రూ. 7,490.72 కోట్ల రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.