16 August, 2026 | 4:54 PM

నిమ్మపల్లిలో కత్తిపోట్ల కలకలం.. యువకుడికి తీవ్ర గాయాలు

16-08-2026 04:12 PM

కోనరావుపేట ఆగష్టు 16 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం మల్కపేట గ్రామానికి చెందిన శివరాత్రి అజయ్ అనే వ్యక్తిపై కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో తొలుత సిరిసిల్లకు తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించినట్లు సమాచారం.సమాచారం అందుకున్న కోనరావుపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడికి దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.