3 May, 2026 | 6:03 PM

కాబోయే భర్త మృతిని తట్టుకోలేక యువతి ఆత్మహత్య

03-05-2026 04:36 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామానికి చెందిన ఓల్లెపు శృతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, శృతికి ఏడు నెలల క్రితం పాత దామ్రాజపల్లికి చెందిన మక్కల సాయికుమార్‌తో వరపూజ జరిగింది. ఉపాధి నిమిత్తం బెహరాన్‌లో ఉన్న సాయికుమార్ రెండు రోజుల క్రితం ఉరివేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

కాబోయే భర్త మృతివార్తతో తీవ్ర మనస్తాపానికి గురైన శృతి, ఆ బాధను తట్టుకోలేక ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.