3 May, 2026 | 6:07 PM

హన్మకొండలో ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తి

03-05-2026 04:33 PM

– విద్యార్థినికి అండగా నిలిచిన సిబ్బంది            

హనుమకొండ,(విజయక్రాంతి): నక్కలగుట్టలోని శ్రీ చైతన్య హైస్కూల్‌లో కేజీబీవీ ఎంట్రెన్స్ పరీక్ష రాయడానికి వచ్చిన శ్రావ్య అనే విద్యార్థిని తన హాల్ టికెట్ పోగొట్టుకోవడంతో ఆందోళనకు గురైంది. జనగామ జిల్లా సూరారం గ్రామానికి చెందిన ఆమె పరిస్థితిని గమనించిన కాజీపేట ట్రాఫిక్ పెట్రోలింగ్ సిబ్బంది పిసి రాజేందర్ (1415), హెచ్‌జి సతీష్ (321) వెంటనే స్పందించారు.

పరీక్షకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంతో, మొబైల్ ద్వారా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి, సమీపంలోని జిరాక్స్ సెంటర్‌లో ప్రింట్ తీసి సకాలంలో విద్యార్థినికి అందజేశారు. వారి సమయస్ఫూర్తి వల్ల విద్యార్థిని ఏడాది కష్టం వృథా కాకుండా కాపాడబడింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసుల మానవత్వాన్ని ప్రశంసించారు.