20 July, 2026 | 2:14 AM

రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు

19-07-2026 04:00 PM

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల్లో కరోనా మళ్లీ కలవరపెడుతోంది. తాజాగా రాజమండ్రిలో(Rajahmundry) మొదటి కరోనా కేసు నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు. 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 16 కరోనా కేసులు నమోదైయ్యాయి. అందులో ఐదుగురు కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, నలుగురు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి ముగ్గురు కోలుకుని సురక్షితంగా బయటపడగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. గోదావరి జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. 10 పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు అందుబాటులో ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. అటు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి.