ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. జోర్డాన్ ఘటనకు ప్రతీకారం
- జోర్డాన్‌లో సైనికుల మరణానికి ప్రతీకారం
- వరుసగా ఎనిమిదో రాత్రి డ్రోన్లు, క్షిపణుల ప్రయోగం
- హోర్ముజ్‌లోని టెహ్రాన్ స్థావరాలపై దాడి
- కువైట్, జోర్డాన్‌లోని ఇరాన్ ప్రతీకార దాడులు
🚨 మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ ఉద్రిక్తతలు!
జోర్డాన్‌లో అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. హోర్ముజ్ జలసంధి, సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు జరగగా, ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ప్రారంభించింది.
ఇరాన్‌పై అమెరికా దాడితో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జోర్డాన్‌లో అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగా అమెరికా హోర్ముజ్ ప్రాంతంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై వరుస వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా మిత్రదేశాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.జోర్డాన్ ఘటనకు అమెరికా ప్రతీకార దాడులు
దుబాయ్/టెహ్రాన్, జూలై 19: జోర్డాన్‌లో అమెరికా సైనికుల మరణానికి కారణమైన దాడికి ప్రతీకారంగా ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్‌పై తమ తాజా వైమానిక దాడులను ముగించినట్లు అమెరికా సైన్యం ఆదివారం తెలిపింది. ఇది వరుసుగా ఎనిమిదో రాత్రి నిర్వహించిన దాడి అని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. జోర్డాన్‌లో అమెరికా సైనికులపై దాడి చేసిన ఐఆర్‌జీసీ బలగాలను దెబ్బ తీయడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని తెలిపింది.
హోర్ముజ్‌లో ఇరాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడులు చేశామని వెల్లడించింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపర్చడమే ఈ దాడుల టార్గెట్ అని చెప్పింది. అమెరికా సైనిక కేంద్ర కమాండ్ తన ప్రకటనలో, ఇరాన్ సైనిక తీరప్రాంత నిఘా, వాయు రక్షణ సౌకర్యాలు, సముద్ర సామర్థ్యాలు, క్షిపణి, డ్రోన్ నిల్వ స్థావరాలపై కూడా దాడి చేసినట్లు పేర్కొంది. శుక్రవారం జోర్డాన్‌లోని ఒక స్థావరంపై టెహ్రాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతిచెందారని, మరొకరు మరొకరు గల్లంతయ్యారని వాషింగ్టన్ తెలిపింది. మరో నలుగురు అమెరికా సైనికులు ఆసుపత్రులకు తరలించబడ్డారని పేర్కొంది.
కానీ మృతుల వివరాలను వెల్లడించలేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, 16 మంది అమెరికా సైనికులు మరణించగా, 430 మందికి పైగా గాయపడ్డారు. జోర్డాన్ వైపు ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని, ఆ మంటలు తమ సరిహద్దులు దాటి వ్యాపించవచ్చని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రజలను హెచ్చరించింది.
కువైట్, జోర్డాన్ వైపు ఇరాన్ ప్రతీకార దాడులు
జోర్డాన్ సమీపంలోని ఓడరేవు పట్టణమైన అకాబా వైపు ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్‌లోని రెండు సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేశామని ఇరాన్ ఆదివారం పేర్కొంది.
కువైట్‌లోని క్యాంప్ ఉదైరిలో ఉన్న ఆయుధాల స్థావరంపై, అలీ అల్ సలేం ఎయిర్ బేస్‌లోని పేట్రియట్ రాడార్ వ్యవస్థ, వైమానిక నిఘా రాడార్‌ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. గత వారం అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైనప్ప టి నుంచి, ఇరాన్ తన దాడులను ఇజ్రాయెల్‌పై కాకుండా, గల్ఫ్‌లోని అమెరికా మిత్రపక్ష అరబ్ దేశాలపై, అలాగే జోర్డాన్‌పై కేంద్రీకరించింది.
ఇరాన్‌పై అమెరికా దాడి ఎందుకు జరిగింది?
జోర్డాన్‌లో అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన సైనిక స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, క్షిపణి నిల్వలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించింది. అనంతరం ఇరాన్ కూడా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై డ్రోన్ దాడులు చేసినట్లు ప్రకటించింది.






