అశోక్‌నగర్‌లో కలకలం.. బుల్లెట్లు, తుపాకులతో CIDకి చిక్కిన లేడీ స్మగ్లర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని(West bengal) ఉత్తర 24 పరగణాల జిల్లా అశోక్‌నగర్‌లో భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఉన్న ఒక మహిళను(West bengal CID Arrests woman ) పశ్చిమ బెంగాల్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఆదివారం అరెస్టు చేసింది. బీహార్‌లోని ముంగేర్ కేంద్రంగా సాగుతున్న అంతర్రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణా ముఠాతో ఆమెకు సంబంధాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందిన సమాచారం మేరకు, నైహతి నుండి హబ్రాకు వాహనంలో ప్రయాణిస్తున్న పూజా బిశ్వాస్‌ను CID అధికారులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఆమె వాహనంలో సామాగ్రిని తనిఖీ చేయగా, అధికారులు తుపాకులు, సుమారు 200 రౌండ్ల మందుగుండు సామగ్రి, 12 మ్యాగజైన్లు, రూ. 12,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.
బీహార్‌లోని జమాల్‌పూర్‌కు వెళ్లే రైలు టిక్కెట్టు కూడా లభ్యం కావడంతో, ఆయుధాలను బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు తీసుకువచ్చారనే అనుమానిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, బిస్వాస్ హబ్రా ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తుండేవారు. దత్తాపుకూర్ పోలీస్ స్టేషన్‌లో(Dattapukur Police Station) నమోదైన ఒక కేసులో గతంలో అరెస్టు అయ్యారు. అక్రమ ఆయుధాల తయారీకి ప్రసిద్ధి చెందిన బీహార్‌లోని ముంగేర్ ప్రాంతం నుంచి తుపాకులను సేకరించి, హబ్రా ప్రాంతంలో వాటిని సరఫరా చేయడానికి నిందితులు పథకం వేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర ఆయుధ అక్రమ రవాణా ముఠా ప్రమేయం ఉండవచ్చని సీఐడీ అనుమానిస్తోంది. ఆ ముఠాలోని ఇతర సభ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ మహిళ బీహార్ నుండి రైలులో పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించి, నైహతిలో దిగి హబ్రాకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు.






