20 July, 2026 | 7:35 PM

Breaking News

పాఠశాలకు వాటర్ ప్లాంట్ విరాళం   •   కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి   •   నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •  

ఖమ్మంలో మెగా Job Mela.. నిరుద్యోగులకు భారీ అవకాశం!

20-07-2026 01:32 AM
  1. నిరుద్యోగుల కోసం సెప్టెంబర్ 26న ఖమ్మంలో..
  2. ఎంఎస్‌డీఈ, ఎన్‌ఎస్‌డీసీ సహకారంతో నిర్వహణ
  3. రానున్న నల్గొండ-, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా
  4. సింగరేణిలో కార్మికులకే 51 శాతం హక్కు ఉండాలి
  5. రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్

ఖమ్మం, జూలై 19: Mega Job Mela Khammam పేరుతో సెప్టెంబర్ 26న ఖమ్మంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. MSDE (Ministry of Skill Development & Entrepreneurship), NSDC (National Skill Development Corporation) సహకారంతో జరిగే ఈ మేళాలో ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ (Skill Training), స్వయం ఉపాధి కోసం Loan అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే తాను రానున్న నల్గొండ-, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కపిలవాయి దిలీప్ కుమార్ స్పష్టం చేశారు.

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్! ఖమ్మంలో సెప్టెంబర్ 26న భారీ Mega Skill, Loan & Job Mela నిర్వహించనున్నారు. ఉద్యోగ అవకాశాలతో పాటు Skill Training, Self Employment Loans కూడా అందుబాటులో ఉండనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

సింగరేణిలో కార్మికులకే 51 శాతం యాజమాన్య హక్కు ఉండాల ని, ఓపెన్ కాస్ట్‌లో ఏర్పడిన భారీ గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు. అలాగే చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ (టీఆర్‌ఎల్‌డీ) ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఖమ్మంలో Mega Job Mela ఎప్పుడు?

ఖమ్మంలో సెప్టెంబర్ 26న Mega Skill, Loan & Job Mela నిర్వహించనున్నారు. MSDE, NSDC సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు, Skill Training, Self Employment Loans అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 26న ఖమ్మంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) సహకారంతో భారీ మెగా స్కిల్, లోన్, జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాలో ఉద్యోగ అవకాశాలతో పాటు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి రుణాల అవకాశాలు కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, ముఖ్యంగా పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న నల్గొండ-, ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అర్హులై న ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, అధిక సంఖ్యలో ఓటరు నమోదు ను విజయవంతం చేసి, తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు, సింగరేణిపై కీలక వ్యాఖ్యలు

సింగరేణి సంస్థలో కార్మికులకే 51 శాతం యాజమాన్య హక్కులు కల్పించి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మిగిలిన 49 శాతం వాటాను కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు. సింగరేణిలో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి, కొందరు అధికారుల పాత్రతో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్ల ప్రమేయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

భారీ గుంతలను పూడ్చి.. 

ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాల వల్ల ఏర్పడిన భారీ గుంతలను పూడ్చి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృత స్థాయిలో వృక్షారోపణ చేపట్టాలని ఆయన సూచించారు. అదేవిధంగా, ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కారణంగా ఇళ్లు దెబ్బతిన్న కార్మికులకు ప్రభుత్వం తక్షణమే నూతన గృహాలను నిర్మించి కేటాయిందాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో తెలంగా ణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధికార ప్రతినిధి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గౌర బీరప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాల్ వంజరి, రాష్ట్ర కోశాధికారి గిరి కుండి, రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు, ఓంకార్, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కురగంటి శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జానీ, టీఆర్‌ఎల్డీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరాచారి, పార్టీ నాయకులు సుధాకర్, దారి, అలాగే పలువురు జిల్లా, మండల, నగర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

FAQ's

ఖమ్మంలో MEGA JOB MELA ఎప్పుడు జరుగుతుంది?

సెప్టెంబర్ 26న నిర్వహించనున్నారు.

JOB MELAలో ఎవరెవరు పాల్గొనవచ్చు?

నిరుద్యోగ యువత, Graduates, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు పాల్గొనవచ్చు.

JOB MELAలో LOAN అవకాశాలు కూడా ఉంటాయా?

అవును. స్వయం ఉపాధి కోసం Loan అవకాశాలు కూడా కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES.....

గిరిజనులకు మెగా జాబ్ మేళా

జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలి

మెగా జాబ్ మేళాలో 225 మంది గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు..

పెద్దపల్లి జిల్లాలో జూలై 17న జాబ్ మేళా నిర్వహణ

హుస్నాబాద్‌లో జూలై 10న మెగా జాబ్ మేళా

ఐదు జిల్లాల్లో అప్రెంటిస్‌షిప్ జాబ్ మేళా