బిక్కనూర్‌కు విద్యా వరం.. పాలాభిషేకంతో కృతజ్ఞతలు
19-08-2026 08:52 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు కావడంతో గ్రామంలో హర్షం వ్యక్తమైంది. పాఠశాల మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలుపుతూ సర్పంచ్ రేఖా సుదర్శన్ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ సచివాలయం వద్ద వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పాఠశాల మంజూరు కావడం బిక్కనూర్‌కు గొప్ప వరమన్నారు. విద్యార్థులకు ఆధునిక విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.






