13 July, 2026 | 2:38 AM

27, 28న ఢిల్లీలో బీసీ సెమినార్

13-07-2026 01:45 AM
  1. ప్రధాని మోదీ ద్వారానే సమస్యలు పరిష్కారం
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 

ముషీరాబాద్, జూలై 12(విజయక్రాంతి):చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టలని- కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖా ఏర్పాటు చేయాలని ఈ నెల 27, 28 తేదీల్లో ఢిల్లీలో జాతీయ స్థాయి బీసీ సెమినార్ ఏర్పాటు చేయనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ సెమినార్‌కు కేంద్ర మంత్రులు అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో మేధావులు, ప్రొఫెసర్లు సంఘ సంస్కర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు.

ఆదివారం ఆయన విద్యానగర్‌లోని బీసీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ వర్గానికి చెందినవారని,  ప్రపంచమంతా ఆయన చాలా గొప్ప నాయకునిగా ప్రపంచమంతా చూస్తున్నారన్నారు. ఆయన సమర్ధవంతమైన అవినీతికి తావులేని పాలనలో భారతదేశం అగ్ర దేశంగా దూసుకుపోతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో బీసీల సమస్యలు దశలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. మోదీ పాలనలోనే బీసీల డిమాండ్లు పరిష్కారమవుతాయన్నారు. బీసీల ఆశలకు ఆశయాలకు అలాగే డిమాండ్లకు అనుగుణంగా ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి మోదీ ద్వారానే జరుగుతుందన్నారు.