యోగా అందరికీ ఆరోగ్యానికి అవసరం
ఖమ్మం రూరల్, మే 18(విజయక్రాంతి): అందరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీడీవో రవికుమార్ సూచించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం యం. వెంకటాయపాలెం గ్రామంలో గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణే ద్యేయంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఉన్నత పాఠశాల ఆవరణంలో ఎం. వెంకటాయపాలెం సర్పంచ్ విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించగా విజయవంతమైంది. వందలాధి మంది ప్రజలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక యోగాసనాలు చేశారు.
నిర్వాహకులు యోగా పట్ల అవగాహణ కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యతను, అది మానసిక ఒత్తిడిని ఎలా దూరం చేస్తుందో శిక్షకులు వివరించారు. ముఖ్యంగా బీపీ, షుగర్, కీళ్ళ నొప్పుల నివారణకు ఉపయోగపడే సులభమైన ఆసనాలను నేర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుమతి, ఎంపీడీవో రవికుమార్, ఎంపీవో శ్రీదేవి, ఎంఈవో శ్రీనివాస్, అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.






