కల్లూరులో SIR-2026 అమలుపై సమీక్ష సమావేశం
కల్లూరు,(విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సత్వర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించేందుకు,మంగళవారం కల్లూరు సబ్-కలెక్టర్ కార్యాలయంలో సబ్-కలెక్టర్ అధ్యక్షతన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్-కలెక్టర్ SIR-2026 కార్యక్రమం అమలు పురోగతిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఇప్పటివరకు చేపట్టిన చర్యలు,ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియలు, అలాగే ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సమగ్రంగా అవగాహన కల్పించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు సమయానుకూలంగా విజయవంతంగా పూర్తి చేయుటకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని సబ్-కలెక్టర్ కోరారు.






