28 July, 2026 | 12:17 PM

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

28-07-2026 11:34 AM

నకిరేకల్,(విజయక్రాంతి): పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... కల్యాణ లక్ష్మి పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తోందన్నారు. ఆడపిల్లల వివాహాలకు ఈ పథకం ఎంతో తోడ్పాటును అందిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.