14 July, 2026 | 6:59 PM

Breaking News

ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •  

ఆరోగ్యవంతమైన జీవనానికి యోగ అవసరం

11-04-2026 12:00 AM

యోగాసనాలు వేసిన కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మారుతున్న జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు, శారీరక, మానసిక సమతుల్యత సాధించేందుకు యోగా అత్యుత్తమ సాధనమని ఆయన పేర్కొన్నా రు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’, ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యక్ర మాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఇంది రా ప్రియదర్శిని స్టేడియంలో ప్రపంచ హో మియోపతి దినోత్సవం, ఆయుష్ డే సందర్భంగా ‘హెల్త్ వీక్’ వేడుకలలో బాగం గా ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష, విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వయంగా  యోగాసనాలు వేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆరోగ్యం కోసం కలిసికట్టుగా.. విజ్ఞానంతో ముందుకు అనే నినా దంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితం లో కనీసం అరగంట సమయం యోగా లేదా వ్యాయామానికి కేటాయించాలని సూ చించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివ రించారు.

జిల్లాను ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు భాగ స్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగా ద్వారా శరీర దృఢత్వంతో పా టు మానసిక ప్రశాంతతను కూడా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.