యోగా ఒక అద్భుత ఔషధం
- సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం, జూన్ 21 : నిరంతరం ఒత్తిడితో విధులను నిర్వహించే పోలీస్ సిబ్బందికి యోగా ఒక అద్భుతమైన ఔషధమని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, గజ్వేల్ ఏసీపీ నర్సింలు, పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిపుణుల పర్యవేక్షణలో వివిధ రకాల ఆసనాలు, ప్రాణాయామం సాధన చేశారు.






