నిత్యం యోగా చేయాలి
జడ్జి వై.జయప్రసాద్
సిద్దిపేట క్రైం, జూన్ 21: రోజూ కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వై.జయప్రసాద్ సూచించారు. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవి అదేశానుసారం సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో యోగా గురువు నర్మద న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి యోగాసనాలు, ప్రాణాయామం నేర్పించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి వై.జయప్రసాద్ మాట్లాడుతూ, నిత్యం యోగా చేస్తే ఆరోగ్యముగా ఉంటారని అన్నారు. అనంతరం యోగా చేసిన వారికి రాగిజావ పంపిణీ చేశారు. యోగా గురువు బొజ్జ అశోక్ ను న్యాయమూర్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రములో న్యాయమూర్తులు ఎన్. సంతోష్ కుమార్, బి.సాధన, కె.సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
అభయ జ్యోతి మనోవికాస కేంద్రంలో...
సిద్దిపేట పట్టణంలోని అభయ జ్యోతి మనోవికాస కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వ్యాస మహర్షి యోగ సేవ సెంటర్ నిర్వాహకురాలు యోగా ఆసనాలు, ప్రాణాయామం నేర్పించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ యోగా ప్రశంసా పత్రాలను అందజేశారు.






