మొలకెత్తని విత్తనం
వర్షాలు లేక రైతుల భగీరథ ప్రయత్నం
- బోర్ల సాయంతో పంటను కాపాడుకునే యత్నం
- ఆదిలోనే అన్నదాతకు కన్నీళ్లు
- 50 శాతం మించని పంట సాగు
- కరువు వస్తుందేమోనని రైతుల ఆందోళన
వానలు కురవాలని ఆలయాల్లో పూజలు, కప్పతల్లి ఆటలు
నిర్మల్, జూన్ 21 (విజయక్రాంతి): వానకాలం సాగు కష్టాలతో ప్రారంభమైంది. మృగశిర కార్తె పూర్తయినా నిర్మల్ జిల్లాలో వాన జడ లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికి రైతులు వేసుకున్న విత్తనాలు మొలకెత్తక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూన్ నెల ముగుస్తున్నా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 50 శాతం కూడా విత్తనాలు వేసుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో జిల్లా రైతంగం ఈ ఏడు కరువు వస్తుందేమోననే ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో 70 శాతం రైతులు వర్షం ఆధారిత, సాగునీటి బోర్ల కింద, చెరువుల కింద పంటలు సాగు చేస్తారు. నిర్మల్ జిల్లాలో వానాకాలం మొత్తం సాగు 4.50 లక్షల ఎకరాలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ఇందులో ప్రధానంగా పత్తి 1.70, వరి 1.30, సోయా 1.10, లక్షల ఎకరాలు, మొక్కజొన్న 30 ఎకరాలు, మిగతావి పసుపు పప్పు దించుకుంటారు జొన్న ప్రధాన పంటలు పండిస్తారు. జూన్ ప్రారంభంలో కురిసిన వర్షాలకు రైతులు మొక్క జొన్న, సోయా, పత్తి, జొన్న విత్తనాలు వేసుకున్నారు. వరి సాగు కోసం నారుమడులు తయారు చేసుకొని ధాన్యం పోశాక అవి ఎండల కారణంగా మొలకెత్తలేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికి రైతులు సాగుచేసిన విత్తనా లు సాధారణ శాతం 70 నుంచి 80 ఉండా ల్సి ఉండగా ప్రస్తుతం 40 నుంచి 50% ఉన్నది. ఎండలు తీవ్రంగా ఉండటంతో భూమిలో నుంచి వచ్చిన మొలకలు కూడా పక్వానికి వచ్చి ఎండిపోతున్నాయి.
కరుణించని కాలం
నిర్మల్ జిల్లాలో జూన్ నెలలో కురవాల్సిన వర్షాపాతంలో 50% మాత్రమే నమోదయింది. 11 సెం.మీ.ల వర్షపాతం కురవా ల్సి ఉండగా ప్రస్తుతం 5.2 సెం.మీ.ల వర్షపాతం నమోదు అయ్యింది. గత ఏడాది ఇదే సీజన్‌లో 16 సెం.మీ.ల వర్షపాతం కురిసింది. కానీ ఈ వానాకాలం సీజన్‌లో బైం సా డివిజన్‌లో మాత్రమే ఎక్కువ వర్షం కురిసింది. ఖానాపూర్, నిర్మల్ డివిజన్లలో సగ టుతో పోలిస్తే 30% కూడా వర్షం కురవలేదు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేసుకున్న పంటలను కాపాడాలన్న
ఉద్దేశంతో రైతులు సాగునీటి బోర్ల సాయంతో భగీరథ ప్రయ త్నం చేస్తున్నారు. కుంటాల, సారంగాపూర్, కుబీర్, బైంసా, నరసాపూర్, సోన్, లోకేశ్వరం, ముధోల్, బాసర, తానూర్, కడెం, దస్తురాబాద్ ప్రాంతాల్లో రైతులు సాగునీటి వ్యవసాయ పంపుసెట్ల నుంచి పైప్ లైన్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్పు ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండ టంతో నీళ్లు ఇచ్చినప్పటికీ భూమిలో తేమ శాతం లేకపోవడం వల్ల రెండు రోజులకే మళ్లీ మొక్కలు వాడిపోతున్నాయి.
ఇప్పటికే విత్తనాలు సేకరించుకొని దుక్కులు దున్ని ఎరువులు వేసి కూలీల సాయంతో పంటలు సాగు చేస్తే ప్రస్తుతం నెలకొన్న వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోతున్నడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఒకవైపు కాలం కలిసి రాకపోవడం, మరోవైపు పెట్టుబడి అధికంగా కావడం, పంట ఎండిపో వడం తో వానదేవుడు కరుణించాలని వేడుకుంటున్నారు. వరుణ దేవుడి కరుణ కోసం కప్పతల్లి ఆటలు, గ్రామాల్లో గ్రామ దేవతలకు నీళ్ల అభిషేకం, రోటి పం డుగ, సంప్ర దాయ పూజలు నిర్వహిస్తున్నా రు. మరో వారం రోజుల్లో వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్ సాగు ముందుకు వెళ్లలేని దుస్థి తి నెలకొనడంతో కరువు పరిస్థితులు వస్తాయేమోనని రైతులు భయాందోళన చెందు తున్నారు.
రెండోసారి విత్తనాల పంపిణీకి యంత్రాంగం సిద్ధం!
నిర్మల్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జూన్ నెలలో వర్షంలో 50 శాతం లోటు ఉన్న నేపథ్యంలో వేసిన విత్తనాలు మొలకెత్తకపోతే తిరిగి రైతులు రెండో సారి విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, విత్తన అభివృద్ధి సంస్థలు కావలసిన పత్తి, సోయా, మొక్కజొన్న విత్తనాలతో పాటు అదనంగా ఎరు వుల వినియోగంపై దృష్టి పెట్టి వాటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నా రు.
జిల్లాలో వర్షం లోటు కారణంగా భూ మిలో తేమశాతం లేకపోవడంతో రైతు లు సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని అన్ని గ్రామాల్లో రైతు వేదికల ద్వారా వ్యవసాయ శాఖ అధికారు లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
సగం విత్తనాలు కూడా మొలకెత్తలేదు
ఇప్పటివరకు వర్షాలు సరిగ్గా కురువలేదు. వర్షాలు కురుస్తాయని ఆశతో 5 ఎకరాల్లో పత్తి, సోయా విత్తనాలు వేసుకున్నాం. ఆ తర్వాత వర్షాలు లేక వేసిన విత్తనాల్లో 50% కూడా మొలకత్తలేదు. మొలసిన మొలకలు కూడా ఎండ కారణంగా ఎండిపోతున్నాయి. మరో వారం రోజుల్లో వర్షం కురువకపోతే ఉన్న పంట కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.
దంగల్ సంతోష్, ఓలా
రైతులు ఆందోళన చెందవద్దు
నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యం లో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వాతావరణ కేంద్రం జూన్ చివరి వారం, జూలై నెలలో వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో రైతులు వర్షాలు కురిసిన తర్వాతనే పంటలు వేసుకోవాలి. విత్తనాలు మొలకెత్తకపోతే రెండోసారి వేసుకుకేందుకు అవసరమైన విత్తనాలు ప్రభుత్వం అందుబాటులో ఉం చింది. రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంటలు వేసుకోవడానికి జూలై 10 వరకు అవకాశం ఉంటుంది.
భావేష్ మిశ్రా, కలెక్టర్, నిర్మల్






