21 June, 2026 | 8:20 PM

యోగతోనే... సంపూర్ణ ఆరోగ్యం...

21-06-2026 06:52 PM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్‌లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఆర్డీఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక యోగా సాధన చేశారు. యోగను నిత్య జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగ ఉత్తమ ఔషధం" అని పేర్కొన్నారు.