31 March, 2026 | 4:50 AM

యాదగిరిగుట్ట ఆలయ హుండీ లెక్కింపు

31-03-2026 12:00 AM

రూ.1.52 కోట్ల ఆదాయం 

యాదగిరిగుట్ట, మార్చి 30 (విజయక్రాం తి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన 20 రోజుల హుండీ ఆదాయం రూ.1,50,01,420 వచ్చినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. యాదగిరిగుట్ట కొండ కింద వ్రత మంటపం హాల్ నెంబర్ 2 లో సోమవారం హుండీని లెక్కించారు. నాణాలు, బంగారము, వెండి, విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా క్షేత్రంలో సోమవారం నిత్య పూజా కైంకర్యా లు శాస్త్రోక్తంగా  నిర్వహించారు.

వేకువ జామున సుప్రభాత సేవతో స్వయంభులను మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్టమూర్తులను  వేదమంతోత్సవములు, మంగళ వా యిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలలను అర్పించారు. ప్రా కారమంటపంలో సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం నిర్వహించారు.