జనసంద్రంగా యాదగిరి క్షేత్రం
31-08-2026 12:28 AM
- ధర్మ దర్శనానికి 3 గంటలు
- స్పెషల్ దర్శనానికి 2 గంటలు
యాదగిరిగుట్ట, ఆగస్టు 30 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రానికి ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు యాదగిరికొండ భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. కొండపైకి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాలను అనుమతించలేదు. ధర్మదర్శనానికి ౩ గంటలు, స్పెషల్ దర్శనానికి ౨ గంటలు పట్టింది. స్వామివారి నిత్య రాబడి రూ.44,13,428 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.






