ప్రమాదకరంగా మ్యాన్‌హోల్
31-08-2026 12:26 AM
పట్టించుకుని అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 30: పెద్ద అం బర్‌పేట్(Pedda Amberpet)52 డివిజన్ తట్టి అన్నారం గ్రామం(Tatti Annaram Village) జీవీఆర్ కాలనీలో మ్యాన్‌హోల్(Manhole) ప్రమాదకరంగా మారింది. మ్యాన్‌హోల్ మూత పాడై విరిగిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జ రుగుతుందోనని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళ వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. సాయంత్ర వేళాల్లో చిన్నా పిల్లలు సైకిళ్లతో ఆడుకుంటుంటారని.. ఏ క్షణమైన ప్రమాదం జరిగే అవకాశముంది కనుక వెం టనే సంబంధిత అధికారులు మ్యాన్‌హోల్‌పై మూత ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.






