25 August, 2026 | 2:54 AM

విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు అందజేత

25-08-2026 01:13 AM

నాగిరెడ్డిపేట్, ఆగస్టు 24 (విజయక్రాంతి): మండలంలోని చినూర్ గ్రామ పాఠశాల విద్యార్థులకు గ్రామ మాజీ ఎంపిటిసి కీర్తిశేషులు గంగారం గౌడ్ జ్ఞాపకార్థం గ్రామ సర్పంచ్ మురళీమోహన్ గౌడ్ సహోదరి స్వప్న రైటింగ్ ప్యాడ్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మురళీమోహన్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.