5 August, 2026 | 7:24 PM

తల్లిపాలే శిశువులకు సంపూర్ణ పోషకాహారం

05-08-2026 06:15 PM

కొండపాక,(విజయక్రాంతి): శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలే ఉత్తమమైన, సంపూర్ణమైన పోషకాహారమని తిప్పారం గ్రామ సర్పంచ్ ఆకుల భద్రప్ప అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బుధవారం కుక్కునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలోని ఒకటి, రెండవ అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల అవసరమైన పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించడం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని, అనంతరం వైద్యుల సూచనల మేరకు అదనపు పోషకాహారాన్ని అందించాలని సూచించారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యాన్ని గుర్తించి పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని పిలుపునిచ్చారు.