జిల్లాల ఇన్చార్జిల నియామకం
ఖానాపూర్,(విజయక్రాంతి): గౌడజన హక్కల పోరాట సమితి మోకుదెబ్బ ఉమ్మడి జిల్లాల కన్వీనర్లను నియమించినట్టు జాతీయ అధ్యక్షులు అమరవీరి నర్సా గౌడ్ తెలిపారు. ఇటీవలి హైదరాబాదులో పోలీట్ బ్యూరో సమావేశంలో గౌడ గీత కార్మికుల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలమైన నిర్మాణం చర్చించడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాకు ఒక్కరిని ఇన్చార్జిలుగా నియమించాను.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శ్రీపతి లింగాగౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేసరి ఆంజనేయులు గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ముత్యం నర్సింలు గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అనంతుల రమేష్ గౌడ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బాలసాని సురేష్ గౌడ్ ( సీనియర్ హైకోర్ట్ న్యాయవాది ) ఉమ్మడి మెదక్ జిల్లాకు కొండాపురం బాలరాజ్, గౌడ్ ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు రాగుల సిద్ధిరాములు గౌడ్, నియమించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మొక్కు దెబ్బ సంఘ నాయకులు పాల్గొన్నారు..






