5 August, 2026 | 8:00 PM

అపహరణకు గురైన బోరు స్థానంలో కొత్తది

05-08-2026 07:14 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు ప్రసాద్ నివాసం సమీపంలో గత నెల 29న గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన హ్యాండ్‌బోరు స్థానంలో బుధవారం గ్రామపంచాయతీ అధికారులు కొత్త హ్యాండ్‌బోరును ఏర్పాటు చేశారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బోరు ఏర్పాటు పనులను సర్పంచ్ మంద నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సంపత్ శ్రీనివాస్, వార్డు సభ్యుడు తోకల శ్రీను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా వెంటనే కొత్త బోరును ఏర్పాటు చేసిన అధికారులను వార్డు సభ్యుడు తోకల శ్రీను అభినందించారు. అలాగే హ్యాండ్‌బోరును అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.