5 August, 2026 | 7:25 PM

వర్షాకాలం వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

05-08-2026 06:19 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతోపాటు గ్రామాలకు వెళ్లిన సమయంలో గ్రామాల పరిసరాలను పరిశీలించి శుభ్రత పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు వైద్యాధికారి డాక్టర్ కుడిమేత మనోహర్ అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని ఈశ్వర్ నగర్ సబ్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు సలహాలు  చేశారు. ప్రతి శుక్రవారం డ్రై డే  నిర్వహించాలన్నారు. గ్రామాల్లో చిన్నపాటి జ్వరంతో  ఉన్నవారికి సరియైన వైద్యం అందించాలన్నారు. ఆయనతోపాటు  హెచ్ ఈ ఓ  నాందేవ్, గోకుల్ తో పాటు  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.