5 August, 2026 | 8:09 PM

ఇంకుడు గుంతలను నిర్మిద్దాం... భూగర్భ జలాలను పెంచుదాం

05-08-2026 07:08 PM

ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు 

ఎంపీడీవో సరోజ, గ్రామ సర్పంచి కడియాల పద్మ అప్పయ్య 

గరిడేపల్లి,(విజయక్రాంతి): వర్షపు నీటిని సంరక్షించుకునే విధంగా ఇంకుడు గుంతలను నిర్మించుకొని భవిష్యత్ తరాలకు భూగర్భ జలాలను పెంచాలని గ్రామ సర్పంచి కడియాల పద్మ అప్పయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ అన్నారు. మండలంలోని గానుగుబండ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, పంట పొలానికి పామ్ పాండ్, ఊరికి ఊరకుంట నిర్మించుకోవాలని వారు సూచించారు. ఇంకుడు గుంత నిర్మించుకునే వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ప్రభుత్వ అధికారుల సూచనల ప్రకారం గుంతల వైశాల్యం ప్రకారం నిర్మించుకోవాలని గ్రామస్తులను కోరారు.