5 August, 2026 | 8:05 PM

కొలువుదీరిన పాలకవర్గం

05-08-2026 07:03 PM

ఊటూరు సహకార సంఘ అధ్యక్షునిగా ముద్దసాని

లక్ష్మీపూర్ లో ప్రమాణ స్వీకార మహోత్సవం

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షునిగా ముద్దసాని శ్రీనివాస రెడ్డి, పాలకవర్గ సభ్యులుగా బొంగోని కనుకయ్య, ఎడ్ల శ్రీధర్, మధునయ్య, కొమ్మగల్ల స్వరూప, మందల బక్కరెడ్డి, గోపు శ్రీనివాస్ రెడ్డి, కంకణాల భూమ్ రెడ్డి, అపురి ప్రేమలత, చింతకాయల రాజేశ్వరి, కనుకుంట్ల స్వామి, వేల్పుల రంగయ్య, తగరం మల్లేషలు పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.