రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామానికి చెందిన యువనాయకులు వైకే ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయికిషోర్ గౌడ్ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 34వ సారి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ హాస్పటల్ లో కరీంనగర్ పట్టణం కోతిరాంపూర్ కి చెందిన కనపర్తి అనిల్ కి కాలు లోని నరానికి రక్తం గట్టకట్టడం వళ్ళ డాక్టర్ ఆపరేషన్ చేయాలనీ సూచించగా వారికి అరుదైన రక్తం ఓ నెగటివ్ అవసరం ఉంది.
ఐతరాజుపల్లి యువనాయకులు వైకే ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయికిషోర్ గౌడ్ కి సమాచారం అందించగా స్పందించిన సాయికిషోర్ గౌడ్ తనే నేరుగా వెళ్లి కరీంనగర్ లోని ప్రతిమ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్బంగా సాయికిషోర్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం చాలా సంతోషం కల్పించిందని సమాజంలో రక్తదానం చేయడం చేపించడం అనేది ప్రతి ఒక్క యువకుడు ఒక బాధ్యత గా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు, రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణదానం చేయడమేనని రక్తదానం చేయడం పట్ల ఎవరికి అపోహలు ఉండకూడదని తెలియజేసారు. ఈ సందర్బంగా 34వ సారి రక్తదానం చేసిన సాయికిషోర్ గౌడ్ ని వై కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు కండెం సురేష్, గౌరవ సలహాదారులు విజేందర్ రెడ్డి, బాధిత కుటుంబసభ్యులు మరియు పలువురు అభినందించారు






