14 June, 2026 | 5:25 PM

సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్

14-06-2026 03:56 PM

ప్రధాన కార్యదర్శిగా నిట్టూరి శ్రీనివాస్

క్యాషియర్ గా కామని శ్రీకాంత్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికల ను ఆదివారం  నిర్వహించడం జరిగింది.వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరి ఏకగ్రీవ నిర్ణయంతో యూనివర్సిటీ అథ్లెటిక్స్ క్రీడాకారుడు, అధ్యక్షుడిగా చొప్పరి సుమన్,ప్రధాన కార్యదర్శిగా నిట్టూరి శ్రీనివాస్, కోశాధికారి గా కామని శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు గా అమిరి శెట్టి రాజలింగం తో పాటు కార్యవర్గాన్ని  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

అనంతరం జాతీయ గీతాలాపన చేసి  ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన  వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నేటి ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల లో  ఆరోగ్యం, చైతన్యం కల్పించడం, ప్రతి ఒక్కరిని నిత్యం వ్యాయామం వైపు ప్రోత్సహించడం ఎంతో అవసరం అన్నారు. రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని కేటాయించి వాకింగ్ చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండవచ్చని పేర్కొన్నారు.

ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడక అలవాటు చేసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వివరించారు. ఉదయాన్నే స్వచ్ఛమైన వాతావరణంలో నడవడం వల్ల శరీరానికి తగిన ఆక్సిజన్ అందడంతో పాటు మనసుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. వాకింగ్ అనేది ఖర్చులేని ఉత్తమ వ్యాయామమని, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నడకను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.

వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక వాకథాన్‌ల, ఆరోగ్య శిబిరాలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించి మరింత మందిని వాకింగ్ వైపు ఆకర్షించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమాజంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని, అందరి సహకారంతో సంస్థను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎన్నికైన కార్యవర్గానికి  శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్, వాకర్స్ అసోసియేషన్  సభ్యులు, యువకులు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..