14 June, 2026 | 5:23 PM

ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి

14-06-2026 04:09 PM

* వారం రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న  

* పులిమడుగు వాగుపై వంతెన..

*  " విజయ క్రాంతి " కథనం ఎఫెక్ట్..

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి అయినా గుడిహత్నూర్ నుండి ఉట్నూర్ రహదారిపై పాత వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ఉట్నూర్ మండలంలోని పులిమడుగు వాగుపై ఉన్న వంతెన  పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలంలో ఈ వంతెన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ఈ వంతెలతోపాటు పలు వంతెనలు సైతం ప్రమాదకరంగా ఉన్నాయని విజయ క్రాంతి  దినపత్రిక గుర్తించింది. "  ప్రమాదకరంగా పాత వంతెనలు"  అనే కథనాన్ని విజయ్ క్రాంతిలో  ఫిబ్రవరి 26వ తారీఖున  కథనం ప్రచురణ అయింది.

ఈ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్శి షా స్పందించారు. వంతెన నిర్మాణం పై  ఆర్ అండ్ బి శాఖ ఈ ఈ నర్సయ్య తో పాటు టెండర్ లో పనులు తీసుకున్న  కాంట్రాక్టర్ ముంతాజ్ ను  ప్రత్యేకంగా పిలిపించి శిథిలావస్థకు చేరుకున్న పులి మడుగు వాగు పై ఉన్న వంతెనను  తొలగించి వర్షాకాలం ప్రారంభంలోగా కొత్త వంతెన నిర్మాణ పనులు  నాణ్యతగా పూర్తి చేయాలని  ఆదేశించారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్శి షా  ఆదేశాల మేరకు  మార్చ్ రెండవ తేదీన వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే ప్రారంభించిన పనులను సదరు కాంట్రాక్టర్ రాత్రి పగలు వంతెన నిర్మాణం పనులను  కొనసాగించి పనులు పూర్తి చేశారు. వారం రోజుల్లో వంతెన పూర్తి పనులు పూర్తయితావని  కాంట్రాక్టర్ తెలిపారు. వారం రోజుల తర్వాత వంతెన పైనుండి  వాహనాల రాకపోకలు  కొనసాగుతాయని  కాంట్రాక్టర్ అన్నారు.

* సుదూర ప్రాంతాల ప్రయాణికుల హర్షం..

గుడిహత్నూర్ నుండి ఉట్నూర్  ప్రధాన రహదారిపై శిథిలా వ్యవస్థకు  చేరిన వంతెనను తొలగించి  కొత్త వంతెన నిర్మించడంపై  సుదూర ప్రాంతాల ప్రయాణికులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో వంతెనపల్లి పూర్తి కాకుంటే కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలతోపాటు  పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, విజయవాడకు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ లేదా నిర్మల్ మీదుగా ప్రయాణం చేయవలసి వచ్చేదని ప్రయాణికులు అన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్  రాజర్శి షా లు తీసుకున్న చొరవతో పాటు  ఆర్ అండ్ బి  ఈ ఈ నర్సయ్య, కాంట్రాక్టర్  ముంతాజ్  పనులు పూర్తి చేసేందుకు వివిధ ప్రాంతాల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.