14 June, 2026 | 4:56 PM

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం

14-06-2026 04:14 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ ను ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జిన్న జగ్జీవన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని ప్రజలకు మేలు చేయాలని సమాజంలో కలం సైనికుల సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో బుడిమి మాజీ సర్పంచ్ లక్ష్మీనాం దేవ్. సొసైటీ డైరెక్టర్ నర్వ శంకర్  గ్రామస్తులు నాగాదర్ డాక్టర్ గోవింద్. జిన్న రవి.నర్వ నారాయణ. జిన్నా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.