14 June, 2026 | 5:26 PM

రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు

14-06-2026 03:53 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాకు చెందిన నైతం కృష్ణారావును తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ పీజీ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో ఈ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా టీఎస్టీడబ్ల్యూటీయూ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ హర్షం వ్యక్తం చేస్తూ నైతం కృష్ణారావుకు అభినందనలు తెలిపారు. గిరిజన విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయాలని కోరారు.నైతం కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గిరిజన విద్యా రంగ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.