మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ
14-06-2026 03:46 PM
బోథ్,(విజయ క్రాంతి): మండలంలోని కౌటా(భి )గ్రామంలో ఆదివారం ఊరికి పోచమ్మకు బోనాల పండుగ కార్యక్రమాన్ని నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం వారు పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులు గడ్డల రమణ తోపాటు వీడీసీ మాజీ అధ్యక్షులు గాజుల సురేందర్. ఎం రమేష్ వీడీసీ ఉపాధ్యక్షులు కొత్త కాపు రాజబాబు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు






