5 May, 2026 | 8:23 PM

Breaking News

లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •   మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క   •   రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా   •   పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ   •  

బొల్లారం పారిశ్రామికవాడలో రాణే కంపెనీలో కార్మికుడు మృతి

20-11-2025 10:34 PM

జిన్నారం: జిన్నారం మండ‌లం బొల్లారం పారిశ్రామిక‌వాడ‌లోని రాణే కంపెనీలో ఓ కార్మికుడు మృతిచెందాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన కృష్ణసింగ్(29) బొల్లారంలోని రాణే కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. గురువారం నాడు పైన రేకులు మార్చుతుండగా పక్కన ఉన్న వెంటిలేషన్ షీట్ నుండి కృష్ణసింగ్ కింద‌ పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. రాణే కంపెనీ యాజమాన్యం పని చేసే కార్మికునికి సేఫ్టీ బెల్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే కార్మికుడు మృతిచెందాడ‌ని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.