27 July, 2026 | 6:54 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?

27-07-2026 06:04 PM

శివంపేట్,(విజయక్రాంతి): మండలంలోని బీజిలిపూర్ గ్రామంలోని ఎస్సీ ఎస్సీ కాలనీలో గత ఐదారు నెలలుగా విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యతో కరెంట్ సింగిల్ పేజ్ వైర్లు తరచూ తెగిపోతూ కరెంట్ సరఫరా నిలిచిపోతున్నా గాని అధికారులు పట్టనట్టు వ్యవహారిస్తున్నారు. గత ఆరు నెలలుగా చ బిజిలిపూర్ దళితవాడలో కరెంట్ సమస్య కష్టతరం అవుతుందన్న విషయాన్ని పలుమార్లు ఏఈ నరేందర్ ద్రుష్టికి ద్రుష్టికి తీసుకెళ్లిన గాని ఇంతవరకు సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదని దళితవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సరఫరా అష్టవ్యస్తం  అవుతూ ప్రతినిత్యం ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడుతున్న గాని సంబంధిత కరెంట్ అధికారులు ఎస్సీ కాలనీ సింగిల్ పేజ్ ట్రాన్స్ పార్మర్ను సందర్శించిన దాఖలాలు లేవని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బీజిలిపూర్ ఎస్సీ కాలనీలో సింగిల్ పేజ్ కరెంట్ సమస్యను పరిష్కరించాలని దళితవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై విద్యుత్ ఏఈ నరేందర్ను వివరణ కోరగా, బీజిలిపూర్ దళితవాడలో ఓవర్ లోడ్ సమస్య ఉన్నదని, సింగిల్ పేజ్ ట్రాన్స్ఫార్మర్ మార్చడం కోసం ప్రతిపాదనలు పంపించామని, బడ్జెట్ రాగానే కరెంట్ సమస్య తీర్చుతామనని తెలిపారు.