29 July, 2026 | 12:00 PM

లోక్‌సభ వాయిదా

29-07-2026 11:24 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Session) ప్రారంభమయ్యాయి. లోక్ సభ(Lok Sabha adjourned) విపక్ష సభ్యులు నినాదాలతో మొదలైంది. విద్యార్థి నిరసనకారులపై జరిగిన పోలీసు చర్యపై హోం మంత్రి అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. సభ ప్రారంభమైన వెంటనే వారు సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. 

ప్రశ్నోత్తరాల సమయం తర్వాత చర్చ చేపడదామని స్పీకర్ తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టే లక్ష్యంతో రూపొందించిన 'పబ్లిక్ పరీక్షలబిల్లు'పై చర్చలకు విపక్షాలు పట్టుబడ్డాయి. పదేపదే సభను అడ్డుకోవాలని చూడడం మంచి పద్ధతి కాదని స్పీకర్ ఫైర్ అయ్యారు. అయితే ప్రతిపక్షం పట్టువీడకపోవడంతో స్పీకర్ సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం నాడు కూడా 'ప్రశ్నోత్తరాల సమయం' (Question Hour) నిర్వహించలేకపోయారు.