29 July, 2026 | 12:54 PM

శిశుమందిర్ లో గురుపౌర్ణమి వేడుకలు

29-07-2026 11:49 AM

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత, వాసవి క్లబ్ అధ్యక్షుడు మరియాల ఉదయ్ బాబు, విద్వత్సమితి సభ్యుడు కిల్లి వెంకట్రావును పాఠశాల ప్రబంధకారిణి ఘనంగా సన్మానించింది.అనంతరం  మరియాల ఉదయ్ బాబు మాట్లాడుతూ సరస్వతీ శిశుమందిర్ నుంచి లభించిన ఈ గౌరవం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ప్రబంధకారిణి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పదో తరగతి తెలుగు విషయంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు విద్వత్సమితి సభ్యులు  కిల్లి వెంకట్రావు,  పెండ్యాల సదాశివ్ గత 14 సంవత్సరాలుగా అందిస్తున్న నగదు పురస్కారాలను ప్రదానం చేశారు.  కీ.శే. దండనాయకుల గోపాల కిషన్ రావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు  చందు  ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంచాలిత సమితి ఉపాధ్యక్షులు కొడిపాక వేణుగోపాల్, కార్యదర్శి నాగుల శ్రీనివాస్, సహ కార్యదర్శి కల్లూరి సంతోష్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు, శ్రీ రాం సత్యనారాయణ ఆచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.