29 July, 2026 | 11:34 AM

ఇల్లందు అభివృద్ధిపై పొంగులేటితో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చ

29-07-2026 10:40 AM

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంత్రితో ఎమ్మెల్యే విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందు నియోజకవర్గానికి రెండో విడతలో అదనంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల గృహ కల సాకారం కావాలంటే ఇల్లందుకు మరిన్ని ఇళ్ల మంజూరు అవసరమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇల్లందు ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మువ్వ విజయ్ బాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.