29 August, 2026 | 7:45 PM

మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం

29-08-2026 06:37 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ ఛైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ అధ్యక్షతన మున్సిపల్ పాలకవర్గ సభ్యుల మధ్య పట్టణ అభివృద్ధి చర్చ జరిగింది. ముఖ్యంగా రాబోయే వినాయక చవితి పురస్కరించుకుని తగు ఏర్పాట్లు, కార్యాలయ కార్యకలాపాలకు అవసరమగు సామాగ్రి కొనుగోలు, డంపింగ్ యార్డు వద్ద వెట్ మిక్స్, మొరము పోయుట, 16వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న కుక్కలు కోతుల ఇబ్బందులు తగ్గించుటకు కుక్కలు, కోతులను పట్టుట, పట్టణంలో పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్  ఆమోదం తెలిపింది. ఇందులోమున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొక్కొండ సమత, కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, ఉన్నారు.