29 August, 2026 | 7:47 PM

దోమల నివారణ చర్యలు చేపట్టాలి: కౌన్సిలర్ జ్యోతి గోపి

29-08-2026 06:43 PM

జనగామ,(విజయక్రాంతి): పట్టణంలోని 3వ వార్డులో దోమల బెడదతో విష జ్వరాలు పెరుగుతున్నాయని, వెంటనే ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టాలని కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చాడు. వార్డు దిగువ ప్రాంతంలో ఉండటంతో మురుగు నిలిచి, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలతో దోమలు విపరీతంగా పెరిగాయని, ప్రజలు వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారని తెలిపాడు. మురికి కాలువల్లో ఆయిల్ బాల్స్, స్ప్రే, చెత్త తొలగింపుకు ప్రత్యేక సిబ్బంది నియమించాలని కోరాడు. స్పందించిన కమిషనర్ తక్షణమే ఫాగింగ్, స్పెషల్ డ్రైవ్ చేపడతామని హామీ ఇచ్చాడు.