29 August, 2026 | 7:46 PM

పరికిబండ లో సర్పంచ్ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

29-08-2026 06:36 PM

మనోహరాబాద్, ఆగస్ట్ 29 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో సర్పంచ్ ఠాకూర్ మోతిబాయ్ లక్ష్మణ్ సింగ్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న వాటికంటే చాలా చక్కగా రూపుదిద్దుకున్నాయని వీటి ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఉపసర్పంచ్ నిమ్మల మహేష్, జిపిఓ కుమార్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.