29 August, 2026 | 7:24 PM

శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం...

29-08-2026 06:39 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు నాగి రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 29న భారత హాకీ దిగ్గజం, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత యువత క్రీడలపై మరింత దృష్టి సారించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.