ఘట్టుమైసమ్మ దేవాలయ డైరెక్టర్ గా మేకల జగన్ యాదవ్
ఘట్ కేసర్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఘట్ కేసర్ ఘట్టుమైసమ్మ దేవాలయ డైరెక్టర్ గా మేకల జగన్ యాదవ్ నియమితులయ్యారు. శనివారం ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్ స్పెక్టర్ ప్రణీత్ ఆలయ కమిటీ డైరెక్టర్ గా మేకల జగన్ యాదవ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి, ఆలయ డైరెక్టర్ లు బర్ల దేవేందర్ ముదిరాజ్, పొట్లచెరువు నాగరాజు, బొక్క జంగారెడ్డి, కడపోల్ల హేమలత సుధాకర్, డిసిసి సెక్రటరీ మామిండ్ల ముత్యాల్ యాదవ్, ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, డీసీసీ మాజీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్, మాజీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, అబ్బసాని అంజయ్య యాదవ్, దయ్యాల కొమరయ్య, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






