20 June, 2026 | 1:02 AM

కుటుంబ ఆరోగ్య పరిరక్షణలో మహిళలది కీలక పాత్ర

20-06-2026 12:00 AM

వడ్డేపల్లి రాజేశ్వరరావు 

కూకట్ పల్లి, జూన్ 19 (విజయక్రాంతి): కుటుంబ ఆరోగ్య పరిరక్షణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సూపరిపాలన (సుశాసన్ ), వికసిత్ భారత్, జన కళ్యాణ్ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గ పరిధి  మోతీ నగర్ కమ్యూనిటీ హాల్ లో వినూత్నమైన వంటల పోటీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ భవాని  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఆరోగ్య పరిరక్షణ, సహజమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని నూనె. ఆరోగ్యకరమైన వంట విధానాలను  గ్యాస్ వినియోగించకుండా ఆరోగ్యకరమైన వంటలు తయారు చేసే పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబ ఆరోగ్య పరిరక్షణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.  ఆరోగ్యకరమైన వంట విధానాలపై అవగాహన పెంచడం అభినందనీయమన్నారు. మహిళలలోని ప్రతిభ సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.

ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది మహిళలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం పోటీలలో విజేతలకు గ్యాస్ వినియోగం లేకుండా వంటకు ఉపయోగపడే ఎలక్ట్రిక్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, కెటిల్స్ తదితర బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ మాజీ కన్వీనర్ శ్రీకర రావు, మోతి నగర్ డివిజన్ అధ్యక్షులు ఎర్ర స్వామి, సీనియర్ నాయకులు శోభ రాజన్, నాగరాజు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.