20 June, 2026 | 1:06 AM

తెలంగాణలో మారుతున్న సమీకరణాలు

20-06-2026 12:00 AM

కేంద్రమంత్రి రాందాస్ అఠవలే, జాతీయ కార్యదర్శి నాగేశ్వరరావు గౌడ్ మధ్య కీలక భేటీ

ముషీరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథావాలేతో బేటి అయినట్లు పార్టీ జాతీయ కార్యదర్శి  శివ నాగేశ్వరరావు గౌడ్ వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించి నట్లు శివ నాగేశ్వరరావు గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ బలహీనత,  బీజేపీ, ఆర్పీఐ ల బలోపేతం, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోతూ బలహీనపడుతోందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ),  రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) లు క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతుతో శరవేగంగా పుంజుకుంటున్నాయని నేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  సమర్థవంతమైన నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాల వల్ల భారతదేశం ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు. దేశం మరింత అభివృద్ధి సాధించాలన్నా, ‘వన్ ఇండియా‘ (ఏక భారత్) సంకల్పం నెరవేరాలన్నా తెలంగాణలోనూ మోదీ నాయకత్వం బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఎన్డీఏ అధికారమే లక్ష్యమని గోరక్ సింగ్ పేర్కొన్నారు.