20 June, 2026 | 1:37 AM

మేడ్చల్‌కు డిగ్రీ కళాశాల.. కలేనా?

20-06-2026 12:10 AM

కొన్నేళ్లుగా వేలాది పేద విద్యార్థుల ఎదురు చూపు.. 

ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కళాశాల ఏర్పాటు చేయకపోవడం బాధాకరం

మేడ్చల్ అర్బన్ జూన్ 19 (విజయక్రాంతి): మేడ్చల్ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలి పొందుందనే అనుమానం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రైవేటు కళాశాలలో చదవలేక పోతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మేడ్చల్ మండల పరిధిలో సుమారు 100 గ్రామాలు పట్టణాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మేడ్చల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్లయితే వేలాది మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కలుగుతుంది.

పేదల కోసమైనా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసమైనా మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉమ్మడి మేడ్చల్ మండల పరిధిలో సుమారు 100 గ్రామాలతో పాటు పట్టణాలకు చెందిన పేద విద్యార్థులు ఉంటారని వారు పై చదువుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని స్థానిక ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

లేదంటే ప్రభుత్వ ఇంటర్ మీడియట్ చదువు తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థులు చదవాలనే కోరికలున్న వారికి అవకాశాలు లేకుండా పోయాయి.కాబట్టి మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద విద్యార్థుల కల నెరవేరుతుంది.

మాజి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చి మరిచారు.. 

మేడ్చల్ అసెంబ్లీ మాజి ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరి చేయిస్తానని హామి మరిచిపోయారని విద్యార్థి సంఘాలు వాపోతున్నారు.

అనంతరం మేడ్చల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా మాజి మంత్రి వర్యులుగా కొనసాగుతున్న చామకూర మల్లారెడ్డి సైతం విద్యార్థి సంఘాలకు మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయిస్తానని ఇప్పటి వరకు డిగ్రీ కళాశాల ఊసెత్తడం లేదనే విమర్శ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని పలు వితార్తి సంఘాలు  డిమాండ్ చేస్తున్నాయి.